హిందువుల “గణ”పతి – ‘విశ్వ’వినాయకుడు
సకల విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాలలో విజయాన్ని ప్రసాదించే ప్రథమ పూజ్యుడు శ్రీ మహాగణపతి. విఘ్నేశ్వరుడు జన్మించిన పరమ పవిత్రతిథి భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి (భాద్రపద శుద్ధ చవితి) నాడు 'వినాయక చవితి' పర్వదినాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్త హిందూ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహపూరిత ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకుంటుంది. సమస్త శుభకార్యాల ప్రారంభంలోనూ ముందుగా గణపతిని పూజించడం భారతీయ సనాతన సంప్రదాయం. మట్టి గణపతిని ప్రతిష్ఠించి, ఔషధ గుణాలున్న 21 రకాల పత్రాలతో (ఏకవింశతి పత్రి) పూజించి, ఉండ్రాళ్లు, కుడుములు నివేదించి,...