సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో భవద్గీత పోటీలు
సిరిసిల్ల :చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము శ్లోకాల పఠనమును నేర్పించి పఠన పోటీ నిర్వహించినది ఇందులో శ్రీ సరస్వతి శిశు మందిర్ గాంధీనగర్ సిరిసిల్ల విద్యార్థులు 137 మంది పాల్గొన్నారు వివిధ గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలో 15 మంది విద్యార్థులు బహుమతులకు ఎంపికయ్యారు వీరిలో నుండి ప్రతి గ్రూపులో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను ఎంపిక చేసి 5 గురిని జిల్లా స్థాయి పోటీలకు...