నిరుపేద వికలాంగుడికి స్కూటీ అందజేత మెచినేని శ్రీ శ్రీనివాసరావు ట్రస్ట్, మాజీ ZPTC చెన్నమనేని శ్రీకుమార్ సహకారంతో మానవత్వం
వార్త ప్రతినిధి/కోనరావుపేట (కొలనూరు) రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఓ నిరుపేద వికలాంగుడికి కష్టకాలంలో అండగా నిలిచేందుకు స్థానిక ప్రముఖులు ముందుకు వచ్చారు. మెచినేని శ్రీ శ్రీనివాసరావు ట్రస్ట్ మరియు మాజీ ZPTC చెన్నమనేని శ్రీకుమార్ సంయుక్త సహకారంతో ఆ నిరుపేద వికలాంగుడికి నూతన స్కూటీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చెన్నమనేని శ్రీకుమార్ పదవిలో ఉన్నా, లేకున్నా గ్రామం మరియు మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని కొనియాడారు....