నిరుపేదలకు అండగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి

ఇద్దరు పేదలకు అరటి పండ్ల బండ్ల వితరణ సిరిసిల్ల: నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులకు విద్య, వైద్యం, ఆర్థిక పరంగా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఏర్పాటైంది. సమాజంలోని అర్హులైన పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా సమితి సేవా కార్యక్రమాలు చేపడుతోంది.   ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు నిరుపేదలైన బస్సు రాజు, రమణారెడ్డిలకు జీవనోపాధి కల్పించేందుకు అరటి పండ్ల వ్యాపారం నిర్వహించుకోవడానికి ఆర్థిక సహాయం అందించింది....