ప్రతిష్ఠాత్మక ISBలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన సిరిసిల్ల వైద్యుడు డాక్టర్ సాయికుమార్
సరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిర్వహించిన అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్‌కేర్ (AMPH) విజయవంతంగా పూర్తి చేశారు.భారతదేశంలో అగ్రగామి బిజినెస్ స్కూల్‌గా, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన ISB, ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానం, ఆసియాలో రెండో స్థానం సాధించడం విశేషం.ఆరోగ్య రంగంలో నాయకత్వ...