ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Date:

Share post:

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష- కదిలిన జనగామ సేవాదళ్జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్ అక్టోబర్ 06 (ప్రజావాణి) ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, ఓటు చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు జనగామ జిల్లా సేవాదళ్ నుండి భారీ మద్దతు లభించిందని, జనగామ జిల్లా సేవ దళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.టీపీసీసీ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశాల మేరకు, దేశంలో ఓటు చోరీ జరుగుతోందని, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈ దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర సేవాదళ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, సోమవారం ఉదయం 10 గంటల వరకు జనగామ జిల్లా నుండి సేవాదళ్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు తరలి వెళ్లారు.జనగామ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జాయ మల్లేష్ గాఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, గ్రామ మరియు వార్డు స్థాయి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, సిఈసి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ గారు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సేవాదళ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జనగామ జిల్లా సేవాదళ్ ఐక్యంగా, క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనగామ జిల్లా సేవాదళ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

నాయక్ సాబ్ సోచో జరా….

నాయక్ సాబ్ సోచో జరా.... అందరికీ జేబు చూపుతున్న కథానాయకుడు.. డాక్యుమెంట్ రైటర్లకే కాదు దళారులతో కూడా నేరుగా చేతులు కలుపుతున్న ఆ సబ్ రిజిస్టర్...? వాళ్లకి ఎంత...

సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో భవద్గీత పోటీలు

సిరిసిల్ల :చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము శ్లోకాల...

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు? అధికారుల కనుసైగల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలుకుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 19...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.