కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు? అధికారుల కనుసైగల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలుకుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి కార్యకలాపాలు పెరిగిపోతున్నాయంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి డాక్యుమెంట్‌కు ఒక నిర్దిష్ట రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుములతో పాటు అదనపు మొత్తాలు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలోని కొన్ని వ్యవహారాలు డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే కొనసాగుతున్నాయని, అధికారుల కనుసైగల్లోనే వసూళ్ల వ్యవహారం సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



