సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో భవద్గీత పోటీలు

Date:

Share post:

సిరిసిల్ల :చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము శ్లోకాల పఠనమును నేర్పించి పఠన పోటీ నిర్వహించినది ఇందులో శ్రీ సరస్వతి శిశు మందిర్ గాంధీనగర్ సిరిసిల్ల విద్యార్థులు 137 మంది పాల్గొన్నారు వివిధ గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలో 15 మంది విద్యార్థులు బహుమతులకు ఎంపికయ్యారు వీరిలో నుండి ప్రతి గ్రూపులో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను ఎంపిక చేసి 5 గురిని జిల్లా స్థాయి పోటీలకు పంపించినది వీరిలో నుండి మూడవ తరగతి విద్యార్థి మ్యాన శ్రీ వర్ధన్ యూకేజీ జిల్లా స్థాయిలో బహుమతి గెలుచుకున్నారు అంతేకాకుండా మూడవ తరగతి విద్యార్థి దూస రుత్విక్ నవంబర్ 1వ తేదీ నాడు కడపలో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికయ్యాడు ఈ పోటీలో గెలుపొందిన బాలబాలికలందరికి ఈరోజు బహుమతులు ప్రశంసా పత్రాలు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జ్ఞాపికలు నగదు పురస్కారము అందించబడినవి సహృదయులు ఆత్మబంధువులైన శ్రీమతి శ్రీ రుద్ర జయ రాజేంద్రప్రసాద్ దంపతులు బహుమతులు వితరణ చేశారు ఇకముందు కూడా ఇలా పోటీలు నిర్వహించుటకు అవకాశం కల్పించాలని చిన్మయ మిషన్ ప్రధాన కార్యదర్శి బాలవిహార్ ఆచార్యులు శ్రీ నల్ల సత్యనారాయణ గారు కోరారు అంతేకాక బహుమతులను అందించిన దంపతులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ఈ సమావేశంలో చిన్మయి మిషన్ కోశాధికారి శ్రీ మేరుగు మల్లేశం కార్యదర్శి వెంగళ కమలాకర్ కార్యవర్గ సభ్యులు జక్కని రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మరియు ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు ఇట్లు చిన్మయ మిషన్ సిరిసిల్ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

నాయక్ సాబ్ సోచో జరా….

నాయక్ సాబ్ సోచో జరా.... అందరికీ జేబు చూపుతున్న కథానాయకుడు.. డాక్యుమెంట్ రైటర్లకే కాదు దళారులతో కూడా నేరుగా చేతులు కలుపుతున్న ఆ సబ్ రిజిస్టర్...? వాళ్లకి ఎంత...

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష- కదిలిన జనగామ సేవాదళ్జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్ అక్టోబర్ 06 (ప్రజావాణి) ప్రజాస్వామ్యాన్ని...

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?

కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా?డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు? అధికారుల కనుసైగల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలుకుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 19...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.