సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా…?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్ వ్యవహారంలో. కీలక సూత్రధారి..వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పబ్బం..చింతకాని మండలం చిన్న మండలంలో జరుగుతున్న మైనింగ్ పై,..మౌనం వెనుక.. వెల్లువెత్తుతున్న ప్రశ్నలు..కథనానికి స్పందనగా. చింతకాని మండలంలో వసూళ్లకు పాల్పడిన ఆ శ్రీనివాసుడు..?దారి మళ్లీంది.. ఆక్రమాలా…?లోకల్ గా రాయల్టీ ఎగవేస్తూ.. దర్జాగా బయటకు తర లుతున్నపట్టించుకోని రవాణా శాఖ అధికారులు..?నిత్యం కాసులు దండుకుంటున్న ఖమ్మం రవాణా శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు తెగింపుగా మారిన ఖమ్మం జిల్లా..వార్త ప్రతినిధి ప్రత్యేక కథనం..2తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుండి వరంగల్ మహబూబాద్ ఖమ్మం భద్రాది కొత్తగూడెం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తూ అంతర్గత రోడ్లు జాతీయ రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అదనపు బరువులతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత రవాణాశాఖ వాణిజ్య పనుల శాఖ పోలీస్ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని గుట్టుగా ఉంచి.. నెలవారీ వసూలు చేసి ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో సంబంధిత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా రాష్ట్రస్థాయిలో ఒత్తిడి తీసుకొని వచ్చి కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ వరకు జరుగుతున్న వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ఖమ్మం రవాణా శాఖలోని శ్రీనివాసరావు అనే ఎంఈఐ అనే అధికారి గతంలో ఇన్చార్జిగా డీటీవో గా విధులు నిర్వహించినట్లు ఆ మేరకు సదరు అధికారి వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రస్తుతం ఆర్టీవో గా విధులు నిర్వహిస్తున్న అధికారిని శాసిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా గ్రానైట్ క్వారీలు నుండి అక్రమంగా పలుకుబడి పరపతి అధికార పార్టీ అనే అండదండలు నెలవారి వసూళ్లతో సదరు అధికారి బిజీగా ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్యవహారం తెలిసినప్పటికీ సదరు అధికారి చూసి చూడనట్లుగా వ్యవహరించి ప్రతినెల లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి ఆ మేరకు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు జోరుగా ఉన్నాయి. ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై ఇసుక దందా నడుస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకొని దర్జాగా వ్యవహారం కొనసాగేటట్లు సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. ఆ వ్యవహారంలో కనీసం ట్రాక్టర్లకు కనీస పత్రాలు లేకపోవడం తెలిసినప్పటికీ వసూళ్లకు పాల్పడుతూ పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ రాయలసీ ఎగ్గొడుతున్నటువంటి అక్రమార్కులపై తనిఖీలు నిర్వహించి విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.








