నిరుపేద వికలాంగుడికి స్కూటీ అందజేత ​మెచినేని శ్రీ శ్రీనివాసరావు ట్రస్ట్, మాజీ ZPTC చెన్నమనేని శ్రీకుమార్ సహకారంతో మానవత్వం

Date:

Share post:

వార్త ప్రతినిధి/​కోనరావుపేట (కొలనూరు)

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఓ నిరుపేద వికలాంగుడికి కష్టకాలంలో అండగా నిలిచేందుకు స్థానిక ప్రముఖులు ముందుకు వచ్చారు. మెచినేని శ్రీ శ్రీనివాసరావు ట్రస్ట్ మరియు మాజీ ZPTC చెన్నమనేని శ్రీకుమార్ సంయుక్త సహకారంతో ఆ నిరుపేద వికలాంగుడికి నూతన స్కూటీని పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చెన్నమనేని శ్రీకుమార్ పదవిలో ఉన్నా, లేకున్నా గ్రామం మరియు మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఆయన చేస్తున్న ఈ సామాజిక సేవ అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని గ్రామ ప్రజల తరఫున ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో కొలనూరు గ్రామ సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉపసర్పంచ్ బిట్ల బాబు, వార్డ్ సభ్యులు తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, భాను, అలాగే సింగిల్ విండో డైరెక్టర్ నుగురి గణేష్, తాళ్లపల్లి సతీష్ గౌడ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వికలాంగుడికి అండగా నిలిచిన నిర్వాహకులను ఈ సందర్భంగా అందరూ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా…?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్ వ్యవహారంలో. కీలక సూత్రధారి

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా...?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్...

ప్రతిష్ఠాత్మక ISBలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన సిరిసిల్ల వైద్యుడు డాక్టర్ సాయికుమార్

  సరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్...

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి, నవంబర్ 3 :విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయాలతో పాటు తమ చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ...

వెల్దుర్తి మండల కేంద్రంలో కుక్కల బెడద

వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కల బెడద భయ బాంత్రులకు గురవుతున్న స్థానిక ప్రజలు వీధిలోకి రావాలంటే కుక్కల భయంతో రాలేని పరిస్థితులు పట్టించుకోని అధికార...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.