పద్మశాలి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
-
18 రోజుల్లోనే 2,500 సభ్యత్వాలు పూర్తి
-
అందుబాటులో ఉండేందుకు వార్డు కమిటీల ఏర్పాటు: పట్టణ పద్మశాలి సంఘం
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘ కార్యాలయం ప్రారంభమై 18 రోజులు పూర్తయిన సందర్భంగా, సంఘం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పట్టణ పద్మశాలి సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకు పట్టణంలో రికార్డు స్థాయిలో 2,500 సభ్యత్వాలు పూర్తయినట్లు వెల్లడించారు.
పట్టణ స్థాయిలోని కుల బాంధవులందరికీ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 3 వార్డుల కమిటీల నియామకం పూర్తయిందని, మిగతా వార్డుల్లో కూడా కమిటీలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. సంఘం కోసం, కుల బాంధవుల శ్రేయస్సు కోసం వార్డు కమిటీల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీల సంక్షేమం, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ విధిగా సభ్యత్వం తీసుకొని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శి జిందం రవీందర్, కోశాధికారి దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు గాజుల సదానందం, కుందన సాయి శరత్, 35వ వార్డు కార్యదర్శి గజ్జెల్లి శ్రీధర్, సభ్యులు గజ్జల్లి వేణు తదితరులు పాల్గొన్నారు.


