నిరుపేదలకు అండగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి

Date:

Share post:

ఇద్దరు పేదలకు అరటి పండ్ల బండ్ల వితరణ

సిరిసిల్ల: నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులకు విద్య, వైద్యం, ఆర్థిక పరంగా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఏర్పాటైంది. సమాజంలోని అర్హులైన పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా సమితి సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు నిరుపేదలైన బస్సు రాజు, రమణారెడ్డిలకు జీవనోపాధి కల్పించేందుకు అరటి పండ్ల వ్యాపారం నిర్వహించుకోవడానికి ఆర్థిక సహాయం అందించింది. అంతేకాకుండా వారు స్వయంగా పండ్ల వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన రెండు పండ్ల బండ్లను సమితి ఆధ్వర్యంలో కొనుగోలు చేసి అందజేశారు.

 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదలకు కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో వైశ్య భవన్ అధ్యక్షుడు కటకం సత్తయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, విశ్వహిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి గుంటుక పురుషోత్తం, బీజేపీ నాయకులు నాగుల శ్రీనివాస్, మామిడాల కృష్ణ, సమితి అధ్యక్షుడు బద్దేపురి దేవేందర్, జనరల్ సెక్రటరీ శ్రీపతి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సిరిమల్లె శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర శ్రీనివాస్‌తో పాటు పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా…?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్ వ్యవహారంలో. కీలక సూత్రధారి

సంచలన కథనానికి.. ప్రభుత్వం ఆరా...?కరీంనగర్ గ్రానైట్ రాళ్ల తరలింపు పై.. దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం..!ఖమ్మం రవాణా శాఖలో.. ఆ శ్రీనివాసుడు..మట్టి రాళ్లు రప్పలు.. గ్రానైట్...

ప్రతిష్ఠాత్మక ISBలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన సిరిసిల్ల వైద్యుడు డాక్టర్ సాయికుమార్

  సరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్...

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి

చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి, నవంబర్ 3 :విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయాలతో పాటు తమ చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ...

వెల్దుర్తి మండల కేంద్రంలో కుక్కల బెడద

వెల్దుర్తి మండల కేంద్రంలోని కుక్కల బెడద భయ బాంత్రులకు గురవుతున్న స్థానిక ప్రజలు వీధిలోకి రావాలంటే కుక్కల భయంతో రాలేని పరిస్థితులు పట్టించుకోని అధికార...
App Icon

Install VP News App

Add to home screen for faster loading and latest updates.